విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలపై అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

  • పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
  • జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నిమాయకాలు పూర్తయినట్లు వెల్లడి
  • జోన్ ప్రధాన కార్యాలయం భవనం పునాది పనులు పూర్తయ్యాయన్న కేంద్రమంత్రి
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌పై ఎంపీలు అడిగిన ప్రశ్నకు, ఆయన పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయినట్లు వెల్లడించారు. జోన్ ప్రధాన కార్యాలయం భవనం పునాది పనులు పూర్తయినట్లు తెలిపారు. అలాగే, ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు రైల్వే లైన్‌కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అన్నారు.

Ashwini Vaishnaw
Visakha Railway Zone
Indian Railways
Railway Zone Visakhapatnam
Andhra Pradesh Railway Projects

More Telugu News